
యువ హీరో శర్వానంద్ హీరోగా నూతన దర్శకుడు కిశోర్ డైరెక్ట్ చేసిన సినిమా శ్రీకారం. గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరబాద్ లో నిర్వహించారు. ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ లో రాం ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. సినిమాలో ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించింది. ఆధునిక వ్యవసాయం గురించి చెప్పే కథతో శ్రీకారం సినిమా వస్తుందని తెలుస్తుంది. ఆల్రెడీ ఖమ్మంలో ఈ నెల 8న శ్రీకారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ఈ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చారు.
ఇక లేటెస్ట్ గా మంగళవారం హైదరబాద్ లో మరో ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ కు తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కే.టీ.ఆర్ గెస్ట్ గా వచ్చారు. ఈ సినిమా ఈవెంట్ తన ఆత్మ సంతృప్తిని ఇచ్చిందని.. సినిమా ట్రైలర్ బాగా నచ్చిందని అన్నారు కే.టీ.ఆర్. మంచి సినిమాలకు ఎప్పుడు తన సహకారం ఉంటుందని అన్నారు. ఈ సినిమాకు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ మినహాయింపు ఇచ్చేందుకు నా వంతు ప్రయత్నిస్తానని కే.టి.ఆర్ అన్నారు. అంతకుముందు మాట్లాడిన డైరక్టర్ హరీష్ శంకర్ కూడా శ్రీకారం సినిమాకు ట్యాంక్స్ ఎక్సెంప్షన్ ఇవాలని కే.టి.ఆర్ ను కోరారు.