
మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమాగా వస్తున్న సినిమా ఆచార్య. కొరటాల శివ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో రాం చరణ్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న విషయం తెలిసిందే. చిరు, చరణ్ ఇద్దరు కలిసి మెగా ఫ్యాన్స్ కు మర్చిపోలేని సినిమాగా ఆచార్యని అందిస్తారని అంటున్నారు. ఈమధ్యనే ఖమ్మం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఆచార్య సినిమా అక్కడ అనుకున్న షెడ్యూల్ పూర్తి చేసుకున్నారని తెలుస్తుంది.
అయితే ఖమ్మం షూటింగ్ లో చిరు కొద్దిగా నీరసపడ్డారని.. వెంటనే మరో షెడ్యూల్ హైదరాబాద్ లో చేయాల్సి ఉన్నా అందుకు చిరు సిద్ధంగా లేరని అంటున్నారు. అందుకే మే 13 రిలీజ్ అనుకున్న ఆచార్య రిలీజ్ వాయిదా పడుతుందని అంటున్నారు. అయితే చిత్రయూనిట్ మాత్రం రిలీజ్ విషయంలో తేడా ఉండదని.. తప్పకుండా అనుకున్న టైం కు సినిమా వస్తుందని చెబుతున్నారు. మరి ఆచార్య రిలీజ్ వాయిదా పడుతుందా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది.