
కింగ్ నాగార్జున హోస్ట్ గా స్టార్ మాలో వచ్చిన సక్సెస్ ఫుల్ రియాలిటీ షో మీలో ఎవరు కోటీశ్వరుడు. అమితాబ్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి షో తెలుగు వర్షన్ గా వచ్చిన ఈ షో సూపర్ సక్సెస్ అయ్యింది. నాగ్ రెండు సీజన్లు హోస్ట్ చేయగా మెగాస్టార్ చిరంజీవి థర్డ్ సీజన్ ను హోస్ట్ చేశారు. ఇక స్టార్ మా నుండి ఆ షో జెమిని వారు సొంతం చేసుకున్నారు.
మీలో ఎవరు కోటీశ్వరుడు షోనే జెమిని టివి ఎవరు మీలో కోటీశ్వరులుగా మార్చేసింది. ఇక హోస్ట్ గా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ను తీసుకుంది. భారీ హంగామాతో ఈ షో ప్లాన్ చేశారు. మార్చ్ 13న ఈ షోకి సంబందించిన ప్రోమో రిలీజ్ చేయనున్నారు. అయితే జెమినికి సంబందించిన ఓటిటి ఫ్లాట్ ఫాం సన్ నెక్స్ట్ లో ఆల్రెడీ ఈ షోకి సంబందించిన క్లిప్స్ లీక్ అయ్యాయి. ఎవరు మీలో కోటీశ్వరులు షో ద్వారా మరోసారి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బుల్లితెర ప్రేక్షకులను అలరించనున్నాడు. బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగు సీజన్ 1ను హోస్ట్ చేసి సూపర్ హిట్ చేసిన తారక్ ఎవరు మీలో కోటీశ్వరులు కూడా హిట్ చేస్తాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.