
బుట్ట బొమ్మ పూజా హెగ్దే ఇప్పుడు టాలీవుడ్ లో సూపర్ ఫాంలో ఉంది. స్టార్ సినిమా అంటే చాలు ముందు పూజా హెగ్దే డేట్స్ కోసం దర్శక నిర్మాతలు వెతికే పరిస్థితి ఉంది. వరుస సినిమాలు.. వాటికి తగినట్టుగానే వరుస హిట్లు అమ్మడికి సూపర్ క్రేజ్ తెచ్చాయి. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా వస్తున్న రాధే శ్యాం సినిమాలో పూజా హెగ్దే నటిస్తుంది. ఈ సినిమాతో పాటుగా అఖిల్ బ్యాచ్ లర్ సినిమాలో కూడా అమ్మడు నటిస్తుంది.
టాలీవుడ్ తో పాటుగా బాలీవుడ్ లో కూడా ఛాన్సులు అందుకుంటున్న పూజా హెగ్దే కోలీవుడ్ అవకాశాలు అందుకుంటుంది. మోడల్ గా ఉన్న పూజా హెగ్దే మొదటి సినిమా తమిళంలోనే చేసింది. జీవ హీరోగా చేసిన మూగముడి సినిమాలో ఆమె నటించింది. ఆ తర్వాత టాలీవుడ్ కు షిఫ్ట్ అయ్యింది. టాలీవుడ్ లో సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న అమ్మడు కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ సరసన ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. విజయ్ 65వ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. ఈ సినిమా కోసం పూజా 2.5 కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది. ఆమె క్రేజ్ చూసి అడిగినంత ఇచ్చేందుకు రెడీ అయ్యారట మేకర్స్. మొత్తానికి జీవ సినిమాతో తెరంగేట్రం చేసి మళ్లీ విజయ్ సినిమాతో కోలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తుంది పూజా హెగ్దే.