సాహో డైరక్టర్ కు హీరో దొరికాడా..?

మొదటి సినిమా రన్ రాజా రన్ తో హిట్ అందుకుని యువ దర్శకుడిగా సత్తా చాటిన సుజిత్ తన నెక్స్ట్ సినిమాని బాహుబలి ప్రభాస్ ను డైరెక్ట్ చేశాడు. సాహో సినిమాతో టేకింగ్ పరంగా సూపర్ అనిపించుకున్న సుజిత్ రిజల్ట్ విషయంలో మాత్రం నిరాశపరచింది. సాహో తర్వాత సుజిత్ నెక్స్ట్ సినిమా ఏంటన్నది ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. ఇక ఇదిలాఉంటే సుజిత్ కన్నడ స్టార్ హీరో సుదీప్ ను డైరెక్ట్ చేస్తారని టాక్.

ఈమధ్యనే కిచ్చ సుదీప్ కు సుజిత్ ఒక స్టోరీ చెప్పడం జరిగిందట. అది బాగా నచ్చిన సుదీప్ సినిమా చేద్దామని చెప్పాడట. సుజిత్ ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లో తీయాలని ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో యువి క్రియేషన్స్ సపోర్ట్ ఎలాగు ఉంటుంది కాబట్టి తెలుగు, కన్నడ మెయిన్ స్ట్రీం మూవీగా తమిళ, హిందీ భాషల్లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. మొత్తానికి సుజిత్ ఇన్నాళ్లు వెయిట్ చేసిన దానికి స్టార్ ఛాన్స్ రావడం లక్కీ అని చెప్పొచ్చు.