
దగ్గుబాటి ఫ్యామిలీ నుండి మరో హీరో ఎంట్రీకి రంగం సిద్ధమవుతుంది. రానా తమ్ముడు అభిరాం సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ షురూ కానుంది. కొన్నాళ్లుగా డిస్కషన్స్ లో ఉన్న సరే మధ్యలో శ్రీ రెడ్డి ఎపిసోడ్ కొద్దిగా డిస్ట్రబ్ చేసింది. అయితే అభిరాం మొదటి సినిమా ఎనౌన్స్ మెంట్ త్వరలోనే వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాను రవి బాబు డైరెక్ట్ చేస్తారని సమాచారం. ఈమధ్యనే రవి బాబు ఓ డిఫరెంట్ స్టోరీని సురేష్ బాబుకి వినిపించారట. అభిరాం డెబ్యూ మూవీగా అది పర్ఫెక్ట్ అని అనుకుని సురేష్ బాబు రవి బాబుతోనే అభిరాం సినిమా ఫిక్స్ చేశారని తెలుస్తుంది.
అభిరాం మొదటి సినిమా ఎలా ఉంటుంది.. రవి బాబు డైరక్షన్ లో అభిరాం ఎలాంటి కథతో వస్తాడు. ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ ఎవరు లాంటి మిగతా విషయాలన్ని త్వరలో తెలుస్తాయి. అయితే కొన్నాళ్లుగా కెరియర్ లో సరైన సక్సెస్ లు లేక డైరక్టర్ గా వెనకపడ్డ రవి బాబు డైరక్షన్ లో దగ్గుబాటి వారసుడి ఎంట్రీ సినిమా అని తెలిసి దగ్గుబాటి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.