భీష్మ డైరక్టర్ భలే మోసపోయాడు..!

ఛలో, భీష్మ సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న డైరక్టర్ వెంకీ కుడుములను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్యానెల్ సభ్యుడిని అని చెప్పిన ఒక వ్యక్తిని నమ్మి 66 వేల రూపాయలు పోగొట్టుకున్నాడు. నితిన్, రష్మిక మందన్న జంటగా నటించిన భీష్మ సినిమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ స్కూటినికి సెలెక్ట్ అయ్యిందని. అక్కడ ఇది ప్రదర్శించడబడాలంటే ఒక్కో కేటగిరికి 11 వేల రూపాయలు చెల్లించాలని చెప్పాడట. భీష్మ సినిమా 6 కేటగిరిలకు అర్హత సాధించిందని.. అందుకే 66 వేల రూపాయలు మీరు చెల్లించాలని చెప్పాడట.

తన సినిమా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడుతుందని సంతోషించి వెంటనే ఆ వ్యక్తి అడిగిన 66 వేల రూపాయలు అతనికి ట్రాన్స్ ఫర్ చేశారట. అయితే ఎలాగు డైరక్టర్ నమ్మాడని.. మూడు కేటగిరిల విషయంలో పొరపాటు జరిగిందని ఇంకాస్త డబ్బు పంపమని అన్నాడట. ఎందుకో డౌట్ వచ్చి సైబర్ క్రైం ఏసిపి కె.వి.ఎం ప్రసాద్ కు ఫిర్యాదు చేశారట. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని తెలుస్తుంది.