ఆచార్య సెట్ లో చిరుతో చరణ్..!

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఆచార్య. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమాలో చిరుతో పాటుగా మెగా పవర్ స్టార్ రాం చరణ్ కూడా నటిస్తున్నారు. ఆచార్యలో చరణ్ పాత్ర అద్భుతంగా ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఆచార్య సెట్ లో చరణ్ తన కామ్రేడ్ లుక్ తో ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు.

కామ్రేడ్ మూమెంట్.. నాన్న పక్కన ఉండే ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తాను అంటూ చరణ్ కామెంట్ కూడా పెట్టడు. ఆ ఫోటోలో చరణ్ భుజం మీద చేయి మాత్రమే కనిపించింది. అది చిరుదే అని అర్ధమవుతుంది. మొత్తానికి ఆచార్య సినిమాలో చరణ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడని తెలుస్తుంది. సిద్ధ పాత్రలో చరణ్ అదరగొట్టేస్తాడని చెప్పొచ్చు. ఓ పక్క ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తూనే ఆచార్య సినిమాకు తన డేట్స్ ఇస్తున్నాడు చరణ్. ఈ ఇయర్ లో చరణ్ ఈ రెండు సినిమాలతో తన సత్తా చాటనున్నాడు.