ప్రభాస్ 'సలార్' గా గర్జించేది అప్పుడే..!

బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమా అంటే పాన్ ఇండియా లెవల్ లో అంచనాలు ఏర్పడ్డాయి. ఆఫ్టర్ బాహుబలి సుజిత్ డైరక్షన్ లో సాహో సినిమా చేసిన ప్రభాస్ ఆ సినిమాతో అంచనాలను అందుకోలేదు. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యాం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. రాధే శ్యాం జూలై 30న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో సలార్, ఓం రౌత్ డైరక్షన్ లో ఆదిపురుష్ సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్.

ఈ రెండు సినిమాలను ఒకేసారి సెట్ మీద తీసుకెళ్లాడు మన యంగ్ రెబల్ స్టార్. సలార్ మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేశారు. 2022 ఏప్రిల్ 14న ప్రభాస్ సలార్ రిలీజ్ ఫిక్స్ చేశారు. ఏడాది ముందే రిలీజ్ డేట్ ప్రకటించి షాక్ ఇచ్చారు మేకర్స్. సలార్ కూడా తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ, మళయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.