
హీరో కమ్ కమెడియన్ కమ్ విలన్ ఏదైనా చేయగలిగే సునీల్ ప్రస్తుతం వస్తున్న ప్రతి ఆఫర్ ను కాదనకుండా చేసుకుంటూ వెళ్తున్నాడు. అల వైకుంఠపురములో చిన్న కామెడీ పాత్రలో కనిపించిన సునీల్.. సుహాస్ హీరోగా వచ్చిన కలర్ ఫోటో సినిమాలో విలన్ గా చేశాడు. పూర్తి స్థాయిలో విలన్ గా కూడా మెప్పించిన సునీల్ అలాంటి పాత్రలకు తాను రెడీ అనేస్తున్నాడు. అల్లు అర్జున్ పుష్ప సినిమాలో కూడా నెగటివ్ టచ్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది.
ఇదేకాకుండా సునీల్ హీరోగా కూడా వరుస సినిమాలు చేస్తున్నాడు. మనసంతా నువ్వే లాంటి సెన్సేషనల్ మూవీ డైరెక్ట్ చేసిన వి.ఎన్ ఆదిత్య డైరక్షన్ లో సునీల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు మర్యాద కృష్ణయ్య టైటిల్ ఫిక్స్ చేశారు. రాజమౌళి డైరక్షన్ లో సునీల్ నటించిన మర్యాద రామన్న సినిమాకు దగ్గరగా ఉన్న ఈ మర్యాద కృష్ణయ్య టైటిల్ ఆడియెన్స్ లో సినిమాపై ఆసక్తి కలిగేలా చేసింది. కొద్దిపాటి గ్యాప్ తర్వాత వి.ఎన్.ఆదిత్య చేస్తున్న ఈ సినిమాతో మరోసారి తన మార్క్ చూపించాలని చూస్తున్నారు. సునీల్ పుట్టినరోజు సందర్భంగా మర్యాద కృష్ణయ్య ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. మర్యాద కృష్ణయ్య ప్రీ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.