వైష్ణవ్ తేజ్ 'జంగిల్ బుక్'

మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెనతో బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. ఉప్పెన మీద దర్శక నిర్మాతలు పెట్టుకున్న అంచనాలు నెరవేరాయి. ఈ ఇయర్ బ్లాక్ బస్టర్ మూవీస్ లో ఉప్పెన ఒకటని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా తర్వాత క్రిష్ డైరక్షన్ లో సినిమా పూర్తి చేశాడు వైష్ణవ్ తేజ్. మొదటి సినిమా రిలీజ్ అవకుండానే క్రిష్ సినిమా ఫినిష్ చేశాడు. ఉప్పెన ఊహించిన దాని కన్నా పెద్ద హిట్ అవడంతో తర్వాత వస్తున్న క్రిష్ సినిమాపై కూడా అంచనాలు పెరిగాయి.

ఈ సినిమాను సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన కొండపొలం నవల ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాకు క్రిష్ టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. అందరికి రీచ్ అయ్యేలా వైష్ణవ్ తేజ్ సెకండ్ మూవీ టైటిల్ గా జంగిల్ బుక్ అని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన ప్రమోషన్స్, రిలీజ్ డేట్ ప్రకటిస్తారని తెలుస్తుంది. ఉప్పెన హిట్ అవడంతో ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా తర్వాత వైష్ణవ్ తేజ్ తన థర్డ్ మూవీ నాగార్జున నిర్మాతగా చేస్తారని తెలుస్తుంది.