ఆకాష్ 'రొమాంటిక్' రిలీజ్ డేట్ ఫిక్స్..!

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ హీరోగా ఆంధ్రాపోరీ, మెహబూబా సినిమాలు చేశాడు. ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఈసారి యూత్ ఆడియెన్స్ ను మెప్పించే రొమాంటిక్ మూవీతో వస్తున్నాడు ఆకాశ్. హాట్ బ్యూటీ కెతిక శర్మ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని తెలుస్తుంది. అనీల్ పాదూరి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను పూరీ, ఛార్మి నిర్మిస్తున్నారు.

కొన్నాళ్లుగా రిలీజ్ కన్ ఫ్యూజన్ లో ఉన్న ఈ సినిమా ఫైనల్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఆకాశ్ పూరీ, కెతిక శర్మ రొమాన్స్ ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. యూత్ ఆడియెన్స్ కు కావాల్సిన అన్ని అంశాలు రొమాంటిక్ లో ఉన్నాయని తెలుస్తుంది. ఈ సినిమాను ఫైనల్ గా జూన్ 18న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. జూన్ 17న అక్కినేని అఖిల్ బ్యాచ్ లర్ సినిమా వస్తుంది. ఆ సినిమా వచ్చిన నెక్స్ట్ డే ఆకాశ్ రొమాంటిక్ సినిమా అవుతుంది. మరి ఏ సినిమా ఎఫెక్ట్ దేని మీద పడుతుంది. రెండు సినిమాల్లో ఏది విజయం సాధిస్తుంది అన్నది చూడాలి.