
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా మొదటి సినిమా దొరసాని రిజల్ట్ తేడా కొట్టినా సరే సెకండ్ మూవీ మిడిల్ క్లాస్ మెలోడీస్ తో మాత్రం హిట్ అందుకున్నాడు. డైరెక్ట్ డిజిటల్ రిలీజైన మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది. ఆనంద్ దేవరకొండ థర్డ్ మూవీ నూతన దర్శకుడు దామోదర డైరక్షన్ లో వస్తుంది. ఈ సినిమాను విజయ్ దేవరకొండ నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు కమల్ క్లాసిక్ మూవీ టైటిల్ పుష్పక విమానం అని ఫిక్స్ చేశారు. సినిమాకు సంబందించిన టైటిల్ పోస్టర్ తో సినిమాపై ఆసక్తిని పెంచారు. పుష్పక విమానం టైటిల్ వాడటం అంటే పెద్ద సాహసమే చేస్తున్నారని చెప్పాలి. ఈ సినిమా ఆడియెన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గదని అంటున్నాడు విజయ్ దేవరకొండ. తనతో పాటు తమ్ముడిని కూడా హీరోగా నిలబెట్టాలని అర్జున్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు బాగానే ఉన్నాయని చెప్పొచ్చు.
ఆనంద్ దేవరకొండ కూడా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో కాకుండా డిఫరెంట్ కథలతో వస్తున్నాడు. ఆనంద్ దేవరకొండ తన థర్డ్ మూవీతో ప్రేక్షకులను మెప్పిస్తాడా లేదా అన్నది చూడాలి.