ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి..!

ఘట్టమనేని ఫ్యామిలీ నుండి వచ్చిన సుధీర్ బాబు తన మార్క్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. లాస్ట్ ఇయర్ వి సినిమాతో ఆకట్టుకున్న సుధీర్ బాబు ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో హ్యాట్రిక్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు టైటిల్ గా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అని ఫిక్స్ చేశారు. ప్రేమకథ గురించి మొదటగా ఎవరికి చెబుతారు అంటూ రెండు రోజుల క్రితం సుధీర్ బాబు ఆడియెన్స్ కు ఓ చిన్న టెస్ట్ పెట్టాడు. దానికి మంచి రెస్పాన్స్ రాగా.. ఫైనల్ గా ఈరోజు సినిమా టైటిల్ ఎనౌన్స్ చేశారు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. టైటిల్ తోనే ఓ మంచి పాజిటివ్ ఫీల్ వచ్చేలా చేశాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తుంది. మొదటి సినిమాతోనే సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కృతి శెట్టి ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పొచ్చు. సుధీర్ బాబు ఈ సినిమాతో పాటుగా 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో పలాస డైరక్టర్ కరుణ కుమార్ తో శ్రీదేవి సోడా సెంటర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో లైటింగ్ శ్రీను పాత్రలో నటిస్తున్నాడు సుధీర్ బాబు.