బుల్లితెర మీదకు ఎన్.టి.ఆర్..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం రాజమౌళి డైరక్షన్ లో ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రం డైరక్షన్ లో సినిమా ఉంది. ట్రిపుల్ ఆర్ తో నేషనల్ లెవల్ లో క్రేజ్ తెచ్చుకుంటాడు కాబట్టి త్రివిక్రం సినిమాను కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా చేయాలని చూస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటుగా మరోసారి బుల్లితెర మీద ఎన్.టి.ఆర్ సందడి చేయనున్నాడని తెలుస్తుంది. 

ఇప్పటికే స్టార్ మా బిగ్ బాస్ సీజన్ 1 హోస్ట్ గా స్మాల్ స్క్రీన్ పై కూడా తారక్ అదరగొట్టాడు. ఇక ఇప్పుడు మళ్లీ కొద్దిపాటి గ్యాప్ తర్వాత బుల్లితెర మీదకు వస్తున్నారు. కింగ్ నాగార్జున హోస్ట్ గా నిర్వహించిన మీలో ఎవరు కోటీశ్వరుడు షో మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ షో నాలుగవ సీజన్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేస్తారని తెలుస్తుంది. స్టార్ మా నుండి ఈ షో జెమిని ఛానెల్ కు వెళ్లినట్టు సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్ లోనే ఈ షో కోసం భారీ సెట్ వేశారట. మొత్తానికి బుల్లితెర మీద మళ్లీ తారక్ సందడి చేయబోతున్నాడు.  మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్ 1, 2 నాగార్జున హోస్ట్ గా చేయగా.. సీజన్ 3ని మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ గా చేశారు.