
నైజాం స్టార్ డిస్ట్రిబ్యూటర్ ఎవరు అనగానే అందరు చెప్పే పేరు ఒక్కటే అతనే దిల్ రాజు. అలాంటి దిల్ రాజుకి ఈమధ్య ఓ డిస్ట్రిబ్యూటర్ షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. ఇంతకీ ఎవరా డిస్ట్రిబ్యూటర్ అంటే అతనే వరంగల్ శ్రీను. క్రాక్ సినిమా విషయం లో దిల్ రాజు డబ్బింగ్ సినిమాలకు సపోర్ట్ చేస్తూ తెలుగు సినిమాలను.. తన లాంటి డిస్ట్రిబ్యూటర్స్ కు అన్యాయం చేస్తున్నాడని గొడవ చేశాడు. క్రాక్ హిట్ అవడం అతను ఫేం అవడం జరిగింది.
ఈమధ్య ప్రతి స్టార్ సినిమాను నైజాంలో అతనే తీసుకుని షాక్ ఇస్తున్నాడు వరంగల్ శ్రీను. లేటెస్ట్ గా కోలీవుడ్ హీరో కార్తీ నటిస్తున్న సుల్తాన్ సినిమాను కూడా వరంగల్ శ్రీను కొనేసినట్టు తెలుస్తుంది. తమిళ హీరోనే అయినా తెలుగులో కూడా మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు కార్తీ. కార్తీ సినిమా ఆంధ్రా, నైజాం రైట్స్ ను దక్కించుకున్నాడు వరంగల్ శ్రీను. సుల్తాను తెలుగు రెండు రాష్ట్రాలకు గాను 7.5 కోట్లకు కొనేసినట్టు తెలుస్తుంది. వరంగల్ శ్రీను దూకుడు చూస్తుంటే దిల్ రాజుకి పోటీగా నైజాం లో మరో బడా డిస్ట్రిబ్యూటర్ అయ్యేలా ఉన్నాడు.