
వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన సినిమా ఉప్పెన. బుచ్చి బాబు డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా మొదటి షో నుండి హిట్ టాక్ తెచ్చుకోగా వసూళ్లతో రికార్డులు సృష్టిస్తుంది. ఇక ఈ సినిమా ఓటిటి రైట్స్ కూడా ఫ్యాన్సీ రేటు పలికాయని తెలుస్తుంది. నెట్ ఫ్లిక్స్ ఉప్పెన సినిమాను 7.5 కోట్లకు కొనేసిందని తెలుస్తుంది.
ఉప్పెన ఏప్రిల్ 11న ఓటిటిలో రిలీజ్ అవుతుంది. థియేటర్ రిలీజ్ తోనే లాభాలు రాగా ఓటిటి నిర్మాతలకు అదనపు లాభాలు తెస్తుందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడిందని తెలుస్తుంది. త్వరలోనే శాటిలైట్ డీల్ కూడా క్లోజ్ అవుతుందని తెలుస్తుంది. సిల్వర్ స్క్రీన్ పై సూపర్ హిట్ అయిన ఉప్పెన డిజిటల్, స్మాల్ స్క్రీన్ ల పై ఎలాంటి సత్తా చాటుతుందో చూడాలి.