
విజయ్ కనకమేడల డైరక్షన్ లో అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సినిమా నాంది. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా మంచి టాక్ తో నడుస్తుంది. సినిమా ఇప్పటికే లాభాల బాట పట్టిందని తెలుస్తుంది. ఎనిమిదేళ్ల తర్వాత నాందితో హిట్ అందుకున్నాడు నరేష్. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పాల్గొన్నారు. సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ నరేష్ కథ ఉంటే సిద్ధం చేసుకో నేను నీతో సినిమా చేస్తానని అన్నారు దిల్ రాజు.
చిన్న సినిమాలు మంచి ఫలితాలతో పెద్ద సినిమాలు అవుతాయని.. ఈ సినిమా తనకు నచ్చిందని.. అందుకే సినిమాతో ఎలాంటి సంబంధం లేకపోయినా సరే వచ్చి మాట్లాడుతున్నా అని అన్నారు దిల్ రాజు. ఇక ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే అల్లరోడితో ఆయన బ్యానర్ లో ఓ సినిమా చేయడం పక్కా అని తెలుస్తుంది. దిల్ రాజు సపోర్ట్ తో అల్లరి నరేష్ తిరిగి ఫాం లోకి వచ్చేస్తాడో లేదో చూడాలి.