తేజ తనయుడి తెరంగేట్రం..!

2000 లో వచ్చిన చిత్రం సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. అప్పటివరకు కెమెరా మెన్ గా ఉన్న తేజ మొదటిసారి డైరెక్ట్ చేసిన సినిమా చిత్రం. ఉదయ్ కిరణ్ తెరంగేట్రం చేసిన సినిమా కూడా అదే. చిత్రం హిట్ కాగా ఆ తర్వాత తేజ డైరక్షన్ లో వచ్చిన నువ్వు నేను సినిమాతో కూడా ఉదయ కిరణ్ సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక 20 ఏళ్ల తర్వాత చిత్రం సినిమాకు సీక్వల్ తీస్తున్నాడు తేజ. రీసెంట్ గా తేజ బర్త్ డే సందర్భంగా చిత్రం 1.1 అంటూ సినిమా ఎనౌన్స్ చేశాడు.

చిత్రం సినిమాలో లానే ఈ సినిమాలో కూడా కొత్త నటీనటులను తీసుకుంటున్నారట. ఇక ఈ సినిమాలో హీరోగా తేజ తనయుడు నటిస్తాడని టాజ్. తేజ తనయుడు అమితవ్ తేజ ఈ సినిమాలో హీరోగా నటిస్తాడని ఫిల్మ్ నగర్ టాక్. కొద్దిరోజులుగా యాక్టింగ్ కోర్స్ నేర్చుకుంటున్న తేజ చిత్రం 1.1 సినిమాతో వారసుడిని పరిచయం చేస్తాడని తెలుస్తుంది. మొత్తానికి తేజ తన సూపర్ సీక్వల్ తో చాలా పెద్ద ప్లాన్ చేసినట్టే అని అంటున్నారు.