
నాచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న సినిమా టక్ జగదీష్. ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ లో సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. సినిమాలో నాని సరసన ఐశ్వర్యా రాజేష్, రీతు వర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమాపై అంచనాలు పెంచగా లేటెస్ట్ గా నాని పుట్టినరోజు కానుకగా వచ్చిన టీజర్ మాత్రం అదిరిపోయింది.
థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుండి టీజర్ రూపంలో ఓ సాంగ్ ను రిలీజ్ చేశారు. మాములుగా టీజర్ లో డైలాగ్స్ ఉంటాయి.. కాని ఒక్క డైలాగ్ కూడా చెప్పకుండా పాటతోనే సినిమా టీజర్ చూపించి అందించాలు పెంచారు. నాని, జగపతి బాబు బ్రదర్స్ గా కనిపిస్తున్న ఈ సినిమా టీజర్ తో సినిమా పక్కా హిట్ అనేలా రుచి చూపించారు. ఆల్రెడీ నానితో శివ నిర్వాణ నిన్ను కోరి సినిమా తీసి హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు టక్ జగదీష్ తో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల అంచనాలకు తగినట్టే ఉంటుందని టీజర్ చూస్తేనే అర్ధమవుతుంది.