
ఉప్పెన సినిమాతో బేబమ్మాగా తెలుగు ప్రేక్షక హృదయాల్లో స్థానం సంపాదించుకుంది కృతి శెట్టి. మొదటి సినిమాతోనే అమ్మడు ఈ రేంజ్ లో ఆడియెన్స్ ను అలరించడం గొప్ప విషయమని చెప్పొచ్చు. ఉప్పెనతో డైరక్టర్, హీరో, హీరోయిన్ ముగ్గురి డెబ్యూ జరిగింది. అయితే ఈ సినిమా ఈ ముగ్గురి కెరియర్ ను నెక్స్ట్ లెవల్ కు తీసుకేళ్లిందని చెప్పొచ్చు. ఉప్పెనతో వైష్ణవ్ తేజ్ కూడా మెగా మేనియా కొనసాగించే సత్తా ఉందని ప్రూవ్ చేశాడు.
ఇక ఇదిలాఉంటే ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి మాత్రం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ వరుస ఛాన్సులు అందుకుంటుంది. ఇప్పటికే నాని శ్యామ్ సింగ రాయ్, సుధీర్ బాబు సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు లేటెస్ట్ గా ఎనర్జిటిక్ స్టార్.. ఉస్తాద్ రామ్ సినిమాలో కూడా ఛాన్స్ అందుకుందట. లింగుస్వామి డైరక్షన్ లో తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీగా ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాల సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న రామ్ మాస్ డైరక్టర్ లింగుస్వామితో చేస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.