పవన్ సినిమాలో బాలీవుడ్ నటుడు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. పిరియాడికల్ మూవీగా వస్తున్న ఈ సినిమాను శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ లో ఏ.ఎం రత్నం నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఇదివరకు ఎప్పుడూ చేయని విధంగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. సినిమాలో పవన్ లుక్, స్టైల్ అన్ని కొత్తగా ఉంటాయని టాక్.

ఇక ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ లో బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ నటిస్తున్నాడని తెలుస్తుంది. పవన్, అర్జున్ రాంపాల్ ల మధ్య జరిగే సన్నివేశాలను ఈ నెల 19 నుండి రామోజి ఫిల్మ్ సిటీలో షూట్ చేస్తారని తెలుస్తుంది. రెండు వారాల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలు షూట్ చేస్తారని తెలుస్తుంది. పవన్ 27వ సినిమాగా రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్ నిధి అగర్వాల్ ఫీమేల్ లీడ్ గా నటిస్తుందని తెలుస్తుంది.

ప్రస్తుతం పవన్ వకీల్ సాబ్ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత మళయాళ మూవీ అయ్యప్పనుం కోషియం రీమేక్ సినిమా కూడా ఈ ఇయర్ లోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ రీమేక్ లో పవన్ తో పాటు రానా దగ్గుబాటి కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.