
ఉప్పెన డైరక్టర్ బుచ్చి బాబు మొదటి సినిమాతోనే తన సత్తా చాటాడు. సుకుమార్ అసిస్టెంట్ గా బుచ్చి బాబు చేసిన ఉప్పెన మూవీ సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ద్వారా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిలు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఇక ఉప్పెన హిట్ తో డైరక్టర్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. మొదటి సినిమా వైష్ణవ్ తేజ్ తొలి పరిచయంగా చేసినా సెకండ్ సినిమా మాత్రం భారీ ప్లాన్ లో ఉన్నాడు బుచ్చి బాబు.
ఈ సినిమాను 80వ దశకం కథతో రాసుకున్నాడట. అంతేకాదు ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ హీరోతో చేస్తాడని అంటున్నారు. ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇద్దరిలో ఒకరు బుచ్చి బాబు సెకండ్ మూవీ హీరోగా నటిస్తారని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలోనే బుచ్చి బాబు సెకండ్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. మొత్తానికి బుచ్చి బాబు మరో క్రేజీ అటెంప్ట్ తో ముందుకొస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ త్వరలోనే వస్తుందని ఫిల్మ్ నగర్ టాక్.