జాన్వి కపూర్ తో కృష్ణవంశీ..?

అతిలోక సుందరి శ్రీదేవి తనయురాలు జాన్వి కపూర్ బాలీవుడ్ లో ఇప్పటికే సినిమాలు చేస్తూ సత్తా చాటుతుంది. అయితే శ్రీదేవి లానే సౌత్ సినిమాల మీద ఫోకస్ పెడుతుంది జాన్వి కపూర్. అందుకే అమ్మడు ఇక్కడ దర్శక నిర్మాతలతో టచ్ లో ఉంటుంది. స్టార్ హీరోల సినిమాల ఆఫర్లు వస్తున్నా సరైన కథ కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తుంది. ఇక జాన్వి కపూర్ తో క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ ఓ సినిమా చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.

ప్రస్తుతం రంగమార్తాండా సినిమా చేస్తున్న కృష్ణవంశీ ఈ సినిమా తర్వాత జాన్వి కపూర్ తో సినిమా చేస్తాడని అంటున్నారు. లాక్ డౌన్ టైం లో ఓ లేడీ ఓరియెంటెడ్ స్టోరీ రాసుకున్నాడట. ఆ సినిమాలో జాన్వి కపూర్ ను నటింపచేయాలని చూస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే జాన్వి టీం తో చర్చలు జరుపుతున్నారట. కథ నచ్చి జాన్వి ఓకే అంటే ఆమె తెలుగు తెరంగేట్రం ముహుర్తం ఫిక్స్ అయినట్టే.