మరో హీరోయిన్ కు గుడి కట్టేశారు.. తమిళ తంబీలంతే..!

హీరోయిన్స్ ను ప్రేమించడం.. ఆరాధించడంలో తమిళ ప్రేక్షకుల తర్వాతే.. వారి కోసం గుడి కట్టి ఆరాధించదం వారికి ఆనవాయితీగా మారింది. అప్పటి ఖుష్బు దగర నుండి ఈమధ్యనే హీరోయిన్ గా పరిచయమైన నిధి అగర్వాల్ వరకు వారికి నచ్చేస్తే చాలు గుడి కట్టి పాలాభిషేకాలు.. పూజలు చేసేస్తారు. లేటెస్ట్ గా ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్ నిధి అగర్వాల్ కు గుడి కట్టేశారు తమిళ తంబీలు. వాలెంటైన్స్ డే సందర్భంగా తమ అభిమాన నటికి మరచిపోని గిఫ్ట్ అందించారు ఆమె అభిమానులు

ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేసి పాలాభిషేకాలు.. పూజలు నిర్వహించారు. తెలుగులో సవ్యసాచి, మిస్టర్ మజ్ ను, ఇస్మార్ట్ శంకర్ సినిమాలు చేసిన నిధి అగర్వాల్ తమిళంలో భూమి, ఈశ్వరన్ సినిమాల్లో నటించింది. తమిళంలో రెండు సినిమాలే చేసిన ఈ అమ్మడు రెండు సినిమాలకే వారి అభిమానాన్ని సంపాదించింది. అందుకే తమిళ ప్రేక్షకులు నిధి అగర్వాల్ కు గుడి కట్టేశారు. నేషనల్ క్రష్ నిధి అంటూ హ్యాష్ ట్యాగ్ తో కూడా ట్రెండ్ చేశారు ఆమె ఫ్యాన్స్. మొత్తానికి తమిళ ప్రేక్షకుల అభిమాన్ని సంపాదించిన నిధి అక్కడ స్టార్ స్టేటస్ అందుకోవడం పక్కా అని తెలుస్తుంది.