
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమా రాధే శ్యామ్. ఈ సినిమాను రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తుండగా యువి క్రియేషన్స్ బ్యానర్ లో 200 కోట్ల పైన బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. పిరియాడికల్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమాలో వికమాదిత్య పాత్రలో ప్రభాస్.. ప్రేరణ పాత్రలో పూజా హెగ్దే నటిస్తున్నారు.
ఈ సినిమాలో ప్రభాస్ కాస్ట్యూమ్స్ కోసమే భారీ బడ్జెట్ కేటాయించారట దర్శక నిర్మాతలు. సినిమా పిరియాడికల్ సబ్జెక్ట్ కావడంతో ప్రభాస్ కాస్ట్యూమ్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టారట. కేవలం హీరో కాస్ట్యూమ్స్ కోసమే 6 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు తెలుస్తుంది. మరి అంత ఖర్చు పెట్టారంటే తప్పకుండా దానికి తగినట్టుగానే హీరో లుక్ ఉంటుందని చెప్పొచ్చు. సినిమాలో పూజా హెగ్దే కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుందని అంటున్నారు. ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాను జూలై 30న రిలీజ్ ఫిక్స్ చేశారు. తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ, మళయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.