అఖిల్.. మోనాల్.. ఓ వెబ్ సీరీస్..!

బిగ్ బాస్ సీజన్ 4లో క్రేజీ కపుల్స్ గా సూపర్ పాపులర్ అయ్యారు అఖిల్ సార్ధక్, మోనాల్ గజ్జర్. హౌజ్ లో బాగా క్లోజ్ అయిన వీరు బిగ్ బాస్ అయ్యాక కూడా అదే రిలేషన్ ను కొనసాగిస్తున్నారు. షో ముగిసిన తర్వాత కూడా అడపాదడపా కలుస్తూ అలరిస్తున్న వీరు ఈమధ్యనే జరిగిన బిగ్ బాస్ ఉత్సవం లో ఆకట్టుకున్నారు. అఖిల్ కోసం మోనాల్ ఓ జాకెట్ గిఫ్ట్ గా ఇవ్వగా.. మోనాల్ కోసం అఖిల్ పట్టీలు తీసుకొచ్చాడు.

వీరిద్దరి జోడీ చూసి దర్శక నిర్మాతలకు వీరి కెమిస్ట్రీ స్క్రీన్ మీద వర్క్ అవుట్ అవుతుందని ఆలోచన వచ్చింది. ఈ క్రమంలోనే అఖిల్, మోనాల్ జోడీగా ఓ వెబ్ సీరీస్ చేస్తున్నారు. బిగ్ బాస్ కు ముందు వరకు కెరియర్ లో వెనకపడ్డ మోనాల్ గజ్జర్ ఇప్పుడు వరుస అవకాశాలు వస్తున్నాయి. అల్లుడు అదుర్స్ లో రంభ ఊర్వశి మేనక సాంగ్ చేసిన అమ్మడు హీరోయిన్ గా కూడా అవకాశాలు అందుకుంటుందని తెలుస్తుంది. ఇక అఖిల్ తో వెబ్ సీరీస్ చేస్తుంది. ఈ సినిమాకు టైటిల్ గా తెలుగు అబ్బాయి.. గుజరాతి అమ్మాయి అని ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా అలరిస్తుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ వెబ్ సీరీస్ ను భాస్కర్ బంతుపల్లి డైరెక్ట్ చేస్తుండగా.. బహస్కర్ రావు నిర్మిస్తున్నారు.