శ్రీ విష్ణు 'అర్జున ఫల్గుణ'

యువ హీరోల్లో డిఫరెంట్ స్టోరీస్ తో ప్రేక్షకుల మెప్పు పొందుతున్నాడు శ్రీ విష్ణు. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, నీది నాది ఒకే కథ లాంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన శ్రీ విష్ణు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం గాలి సంపత్ తో పాటుగా రాజా రాజ చోర సినిమాలు చేస్తున్న శ్రీ విష్ణు లేటెస్ట్ గా మరో సినిమా ఎనౌన్స్ చేశాడు. 

అర్జున ఫల్గుణ టైటిల్ తో శ్రీ విష్ణు సినిమా వస్తుంది. తేజా మార్ని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు పెంచారు. కొత్త కథలే కాదు అచ్చమైన తెలుగు టైటిల్ తో వస్తున్న శ్రీ విష్ణు లేటెస్ట్ గా అర్జున ఫల్గుణ సినిమాతో ప్రేక్షకులను మెప్పించాలని చూస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య నిర్మించిన మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. మరి శ్రీ విష్ణు ఈ కొత్త ప్రయత్నం ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.