
గోపీచంద్ హీరోగా మారుతి డైరక్షన్ లో వస్తున్న సినిమాకు టైటిల్ గా పక్కా కమర్షియల్ అని ఫిక్స్ చేశారు. చాలారోజులుగా ఈ టైటిల్ ప్రచారంలో ఉండగా ఫైనల్ గా వాలెంటైన్స్ డే స్పెషల్ గా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ప్రతిరోజూ పండుగే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మారుతి తన నెక్స్ట్ సినిమాను అసలేమాత్రం ఫాం లో లేని గోపీచంద్ తో ఫిక్స్ చేసుకోవడం అందరిని షాక్ అయ్యేలా చేసింది.
ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2, యువి క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్నారు. బాలీవుడ్ మూవీ జాలీ ఎల్.ఎల్.బి 2కి రీమేక్ గా ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. గోపీచంద్ సరసన రాశి ఖన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. పక్కా కమర్షియల్ మారి మార్క్ తో రాబోతున్న పక్కా ఎంటర్టైన్మెంట్ మూవీ అవుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం గోపీచంద్ సంపత్ నంది డైరక్షన్ లో సీటీమార్ సినిమా చేస్తున్నాడు.