రాధే శ్యామ్ ఫస్ట్ గ్లింప్స్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా రాధే శ్యామ్. ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేశారు. సినిమా టీజర్ విషయానికి వస్తే హీరోయిన్ ను ఇంప్రెస్ చేసేందుకు హీరో ఇటాలియన్ భాషలో ఏదో అంటాడు.. దానికి హీరోయిన్ నవ్వుతూ వెళ్తుంటుంది. 

ఇక ఫైనల్ గా నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా అంటే.. చ.. వాడు ప్రేమకోసం చచ్చాడు.. నేను అలా కాదు అని అంటాడు. నిమిషం కూడా లేని ఈ టీజర్ ప్రభాస్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. ప్రభాస్, పూజా హెగ్దేల జోడీ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచేలా ఉంది. సినిమా టీజర్ తో పాటుగా జూలై 30న రిలీజ్ అని ప్రకటించారు. మొత్తానికి మే, జూన్, జూలై టాలీవుడ్ లో బాక్సాఫీస్ పై దండయాత్రకి తెలుగు సినిమాల సందడి షురూ కానుందని చెప్పొచ్చు.