రచయిత ప్రేమ కథ.. 'విక్రమ్' టీజర్ రిలీజ్ చేసిన బాబి..!

ఒకప్పుడు ప్రేక్షకులు సినిమా చూడాలంటే అది స్టార్ హీరో సినిమానే అయ్యుండాలి.. లేదా నచ్చిన దర్శకుడు తీసి ఉండాలి. కాని ఇప్పుడు సినిమా చూసే ఆడియెన్స్ ఇవేవి లెక్కలేసుకోవడం లేదు. సినిమా కంటెంట్ బాగుందా అది కొత్త వాళ్లు చేసిన ప్రయత్నం అయినా సరే చూసేస్తున్నారు. ఈ క్రమంలో వస్తున్న మరో డిఫరెంట్ సినిమా విక్రమ్. 

నాగ వర్మ హీరో, నిర్మాతగా చేస్తున్న విక్రమ్ సినిమాను హరిచందన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఓ రచయిత ప్రేమలో పడితే అన్న కథాంశంతో ఈ సినిమా వస్తుంది. సినిమాలో నాగవర్మ సరసన దివ్యా రావు హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా టీజర్ ను సర్ధార్ గబ్బర్ సింగ్, జై లవ కుశ సినిమాల దర్శకుడు కె.ఎస్ రవింద్రా అలియాస్ బాబి రిలీజ్ చేశారు. టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉందని సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని అన్నారు బాబి.