చెక్ రైట్స్ అందుకున్న వరంగల్ శ్రీను..!

నితిన్, చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ చెక్. భీష్మ తర్వాత నితిన్ నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. చంద్రశేఖర్ యేలేటి కొద్దిపాటి గ్యాప్ తీసుకుని మరి చేసిన సినిమా చెక్. ఈ మూవీలో ప్రియా ప్రకాశ్ వారియర్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్స్ గా నటించారు. ఫిబ్రవరి 26న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జోరుగా సాగుతుంది.

సినిమా నైజాం హక్కులను వరంగల్ శ్రీను కొనేసినట్టు తెలుస్తుంది. ఈమధ్య నైజాం డిస్ట్రిబ్యూటర్స్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు వరంగల్ శ్రీను. క్రాక్ సినిమా విషయంలో దిల్ రాజుపై విమర్శలు చేసిన వరంగల్ శ్రీను నైజాంలో స్ట్రాంగ్ అవుతున్నాడు. చెక్ రైట్స్ ను వరంగల్ శ్రీను 5.40 కోట్లకు కొనేసినట్టు తెలుస్తుంది. ఆంధ్రా 7 కోట్లు పలుకగా.. సీడెడ్ లో నిర్మాతలు సొంతంగా రిలీజ్ చేసుకుంటున్నారని తెలుస్తుంది. ఇక చెక్ డిజిటల్, శాటిలైట్ రైట్స్ కూడా జెమిని వారు సొంతం చేసుకున్నారని తెలుస్తుంది.