కథని కళ్లకు చూపించేది నాట్యం.. టీజర్ మెప్పించింది..!

ఒకప్పుడు సినిమా అంటే అందులో హీరో ఏ స్టార్.. ఏ స్టార్ డైరక్టర్.. హీరోయిన్ ఎవరు.. ఇవన్ని చూసేవారు. అవి చూసి కథ, కథనాలు ఎలా ఉన్నా మా అభిమాన నటుడి సినిమా తప్పకుండా బాగుంటుందని వెళ్లేవారు. అయితే ఇప్పుడు సీన్ మారింది. సినిమా కథ మారింది. స్టార్ సినిమాలు కూడా సరైన కంటెంట్ లేదంటే తిప్పికొడుతున్నారు. అంతేకాదు ఎలాంటి పరిచయం లేని కొత్త వారి సినిమాలు కంటెంట్ బాగుంటే సూపర్ హిట్ చేసేస్తున్నారు.

ఇక అలాంటి కంటెంట్ ఉన్న సినిమాల్లో ఒకటిగా వస్తుంది నాట్యం. ప్రముఖ కూచిపుడి నృత్యకారిణి సంధ్యా రాజు లీడ్ రోల్ లో వస్తున్న సినిమా నాట్యం. రేవంత్ కోరుకొండ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, డైరక్షన్ మాత్రమే కాదు కెమెరా, ఎడిటింగ్ కూడా తానే హ్యాండిల్ చేశాడని తెలుస్తుంది. సినిమా టీజర్ లేటెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ చేతుల మీదగా రిలీజ్ చేశారు. టీజర్ ఇంప్రెస్ చేయగా సినిమా చూసిన దిల్ రాజు తన బ్యానర్ లో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. కథని కళ్లకి చూపించేదే నాట్యం అని డిఫరెంట్ కథతో డ్యాన్స్ నేపథ్యంతో వస్తున్న సినిమా నాట్యం.