లైగర్ రిలీజ్ ఆ డేట్ లాక్ చేశారా..?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా లైగర్. ధర్మ ప్రొడక్షన్స్ లో కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. లైగర్ టైటిల్ పోస్టర్ సాలా క్రాస్ బ్రీడ్ అంటూ షాక్ ఇచ్చిన పూరీ సినిమాని కూడా అదే రేంజ్ లో ఉండేలా తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాను సెప్టెంబర్  9న రిలీజ్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. వినాయక చవితి సందర్భంగా లైగర్ రిలీజ్ కాబోతుంది. విజయ్ మార్క్ ఎంటర్టైనింగ్ తో పాటుగా పూరీ మార్క్ టేకింగ్ తో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. అనన్యా పాండే కూడా సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుందని తెలుస్తుంది. అర్జున్ రెడ్డి సినిమాతో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ లైగర్ తో పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు. మరి ఈ సినిమా రౌడీ హీరోకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.