మగబిడ్డకు జన్మనిచ్చిన నువ్వు నేను హీరోయిన్..!

తేజ డైరక్షన్ లో ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ నువ్వు నేను. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అనిత. మొదటి సినిమాతోనే సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అనిత ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించింది. సినిమాలైతే చేసింది కాని అమ్మడు అనుకున్న స్థాయిలో విజయాలను అందుకోలేదు. ఇక టాలీవుడ్ నుండి బాలీవుడ్ చెక్కేసిన ఈ అమ్మడు రోహిత్ రెడ్డిని పెళ్లాడింది. ఈమధ్య ప్రెగ్నెన్సీతో ఉన్న పిక్స్, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన అనిత పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిందని తెలుస్తుంది. 

అనిత భర్త రోహిత్ ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. అనితా, రోహిత్ ఇద్దరు చాలా రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. అనిత ప్రెగ్నెన్సీ కన్ఫాం అయిన దగ్గర నుండి బేబీ బంప్ తో ప్రత్యేకంగా ఫోటో షూట్ ని కూడా చేశారు. తన బాబుని ఎత్తుకుని అనిత షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.