
అల వైకుంఠపురములో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాను సుకుమార్ డైరక్షన్ లో పుష్ప సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాతో బన్నీ మొదటిసారి పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత గౌతం మీనన్ డైరక్షన్ లో సినిమా ప్లాన్ చేస్తున్నాడట అల్లు అర్జున్.
తమిళ దర్శకుడే అయినా గౌతం మీనన్ అంటే తెలుగులో కూడా క్రేజ్ ఉంది. నాగ చైతన్యతో ఏమాయ చేసావె సినిమా డైరెక్ట్ చేసిన గౌతం మీనన్ తెలుగులో మళ్లీ ఫాం లోకి రావాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో గౌతం మీనన్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. అల్లు అర్జున్ కోసం ఓ పవర్ ఫుల్ పోలీస్ యాక్షన్ స్టోరీని రెడీ చేశాడట. బన్నీ ఓకే అంటే ఈ ప్రాజెక్ట్ ను కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించాలని చూస్తున్నాడట. గౌతం మీనన్ తో అల్లు అర్జున్ కాంబో ఎలా ఉండబోతుందో చూడాలి.