
సూపర్ స్టార్ మహేష్ రాముడు అవతారం ఎత్తుతున్నాడా.. అదేంటి ప్రభాస్ కదా ఆదిపురుష్ లో హీరో. అలాంటిది మహేష్ ఎలా రాముడు అవుతాడని డౌట్ రావొచ్చు. మధు వంతెన చేస్తున్న రామయణంలో మహేష్ ని రాముడిగా సెలెక్ట్ చేయాలని చూస్తున్నారట. ఈ సినిమాలో రావణుడిగా హృతిక్ రోషన్.. సీత పాత్రలో దీపిక పదుకొనె నటిస్తారని తెలుస్తుంది. రాముడి పాత్రలో మహేష్ ఇది జరిగితే మాత్రం సినిమా రేంజ్ వేరేలా ఉంటుంది.
ఓ పక్క ఆదిపురుష్ లో ప్రభాస్ రాముడిగా కనిపిస్తాడని తెలుస్తుండగా.. పోటీగా మహేష్ ను రాముడిగా చూపించి సర్ ప్రైజ్ చేయనున్నారు. మధు వంతెన రూపొందిస్తున్న ఈ రామయణం 3డిలో వస్తుందని తెలుస్తుంది. మహేష్ రాముడు ఈ వార్త వింటుంటేనే అభిమానులకు ఉత్సాహంగా ఉంది. అనుకున్నట్టుగానే సినిమా చేస్తే మాత్రం ఆ రేంజ్ వేరేలా ఉంటుందని చెప్పొచ్చు.