ఉప్పెన ఎంత తెస్తే హిట్..!

మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెనకు భారీ క్రేజ్ వచ్చింది. సినిమాలో హీరోయిన్ గా నటించిన కృతి శెట్టి కూడా సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని తెలుస్తుంది. ప్రచార చిత్రాలతో సినిమాపై బీభత్సమైన క్రేజ్ రాగా సినిమా బిజినెస్ కు అదే సహకరించింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఉప్పెన సినిమా వరల్డ్ వైడ్ గా 20.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు తెలుస్తుంది.

నైజాం 6 కోట్లు, ఆంధ్రా 10 కోట్లు, సీడెడ్ 3 కోట్లు బిజినెస్ చేసిందట. ఇక ఓవర్సీస్ మిగతా ఏరియాలు కలిపి 1.5 కోట్లు బిజినెస్ చేసిందని తెలుస్తుంది. వరల్డ్ వైడ్ గా ఉప్పెన 20.50 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని తెలుస్తుంది. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే 22 కోట్ల దాకా వసూళ్లు రాబట్టాల్సిందే. మరి మెగా హీరో మొదటి సినిమాకు అంత వసూళ్లు వస్తాయా లేదా అన్నది చూడాలి.