
సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట కోసం కొత్త లుక్ ట్రై చేస్తున్నాడని తెలిసిందే. ఈమధ్య కాలంలో మహేష్ చేస్తున్న సినిమాలు.. లుక్ అన్ని ఒకేరకంగా ఉంటున్నాయని కామెంట్స్ వచ్చాయి. అందుకే పరశురాం సర్కారు వారి పాట సినిమాలో మహేష్ మాస్ లుక్ తో కనిపిస్తున్నారని తెలుస్తుంది. ఇక లేటెస్ట్ గా మహేష్ టీం మహేష్ కొత్త లుక్ ని ట్విట్టర్ లో రివీల్ చేశారు. సూపర్ స్టార్ స్వాగ్ అంటూ మహేష్ న్యూ లుక్ పిక్ షేర్ చేశారు.
దాదాపు సర్కారు వారి పాట సినిమాలో మహేష్ ఇలానే ఉంటాడని చెప్పొచ్చు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో మహేష్ క్యారక్టరైజేషన్, పరశురాం టేకింగ్, డైలాగ్స్ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు. మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను 2022 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు.
Super ⭐ Swag!@urstrulymahesh #SSMBArchiveson9th pic.twitter.com/SX9IiZp1jJ
— Team Mahesh Babu (@MBofficialTeam) February 9, 2021