
శర్వానంద్ హీరోగా నూతన దర్శకుడు కిశోర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా శ్రీకారం. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రాం ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమాకు మిక్కి జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ను సూపర్ స్టార్ మహేష్ రిలీజ్ చేశారు. యాక్టర్ కొడుకు యాక్టర్, ఇంజినీర్ కొడుకు ఇంజినీర్, డాక్టర్ కొడుకు డాక్టర్ ఇలా అందరు వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.. కాని రైతు కొడుకు మాత్రం అంటూ శ్రీకారం ఇంట్రెస్టింగ్ పాయింట్ తో వస్తున్నారు.
ఈ సినిమాలో శర్వానంద్ రైతుగా నటిస్తున్నారు. తెలుగులో ప్రయోగాలు చేసే హీరోల్లో శర్వానంద్ ఒకరు. ఆల్రెడీ శతమానం భవతి సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ తోనే చేశాడు. ఆ సినిమా మంచి ఫలితాన్ని అందుకుంది. అందుకే మరోసారి శ్రీకారం అంటూ రాబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా నాని గ్యాంగ్ లీడర్ భామ ప్రియాంకా అరుల్ మోహన్ నటిస్తుంది. సినిమా టీజర్ కు ముందే కొద్దిరోజుల ముందు రిలీజైన భలేగుందె బాలా సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. మార్చ్ 11న రిలీజ్ అవుతున్న శ్రీకారం శర్వానంద్ ఖాతాలో హిట్ పడేలా చేస్తుందో లేదో చూడాలి.