
మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతున్న భామ కృతి శెట్టి. సినిమా టీజర్, ట్రైలర్ తో పాటుగా సాంగ్స్ తోనే హిట్ టాక్ తెచ్చుకుంది. అందుకే ఉప్పెన రిలీజ్ అవకుండానే కృతి శెట్టికి మంచి డిమాండ్ ఏర్పడింది. ఉప్పెన తర్వాత ఇప్పటికే నానితో శ్యామ్ సింగ రాయ్.. సుధీర్ బాబుతో ఛాన్స్ అందుకుంది. ఈ రెండు సినిమాలతో మరింత క్రేజ్ తెచ్చుకునే అవకాశం ఉంది.
ఇక ఈ రెండు సినిమాల తర్వాత అక్కినేని అఖిల్ హీరోగా వస్తున్న సినిమాలో కూడా అమ్మడు లక్కీ ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. అఖిల్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి ఛాన్స్ కొట్టేయడం అమ్మడికి తెలుగులో పాపులర్ అవడం పక్కా అని చెప్పొచ్చు. కన్నడ పరిశ్రమ నుండి వస్తున్న కృతి శెట్టి ఉప్పెనతో రాబోతుంది. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ఇద్దరి జోడీ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది.