
మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న మరో హీరో వైష్ణవ్ తేజ్. బుచ్చి బాబు డైరక్షన్ లో ఉప్పెన సినిమాతో తెరంగేట్రం చేస్తున్నాడు వైష్ణవ్ తేజ్. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతుంది కృతి శెట్టి. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చిన ఉప్పెన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగా ఫ్యాన్స్ హంగామా అదిరిపోయింది.
వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాకు ఇంత మంచి కథ, టీం దొరకడం మంచి విషయమని అన్నారు. సినిమా తాను చూశానని కొన్నాళ్లు మనతో ఉండిపోయే సినిమా ఉప్పెన అని అన్నారు చిరంజీవి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కృతి శెట్టికి మంచి అవకాశాలు వస్తాయని.. ఇప్పుడే నిర్మాతలు ఆమెను బుక్ చేసుకోండని చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. ఆమె నటనకు అందరు ఇంప్రెస్ అవుతారని అన్నారు. ఇక సినిమాలో విలన్ గా నటించిన విజయ్ సేతుపతిని ప్రశంసించారు చిరు. సైరా సినిమాలో చిన్న పాత్ర అయినా చేసిన విజయ్ సేతుపతి ఈ సినిమాలో తన విశ్వరూపం చూపించాడని. ఎలాంటి పాత్రనైనా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విజయ్ సేతుపతి ఇంకా మరెన్నో గొప్ప చిత్రాలు చేయాలని ఆకాంక్షించారు.
సైరా సినిమా షూటింగ్ జార్జియాలో జరుగుతున్న టైంలో అభిమానులంతా రాగా అది తనకోసమని వెళ్తే అందరు విజయ్ సేతుపతి గురించి అడిగారని.. ఆయన క్రేజ్ అక్కడ దాకా వెళ్లిందని అన్నారు చిరు. చిరు చెప్పారని కాదు కాని విజయ్ సేతుపతికి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. రీసెంట్ గా కోలీవుడ్ మూవీ మాస్టర్ సినిమాలో కూడా భవాని పాత్రలో విజయ్ సేతుపతి నటన మెప్పించింది. తెలుగులో ఉప్పెనతో గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తున్న విజయ్ సేతుపతి ఇక్కడ కూడా వరుస సినిమాలు చేసేలా ఉన్నారు.