అర్జున్ రెడ్డి కాంబో సెట్ చేస్తున్న మైత్రి మేకర్స్..!

మైత్రి మూవీ మేకర్స్ ప్రస్తుతం తెలుగులో వరుసగా స్టార్ సినిమాలు చేస్తున్న అగ్ర నిర్మాణ సంస్థ. మహేష్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ తో సినిమాలు చేస్తూ మరో పక్క యువ హీరోలు వైష్ణవ్ తేజ్ లాంటి వారితో సినిమాలు చేస్తున్నారు. వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ఉప్పెన సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా తెరకెక్కించారు మైత్రి మూవీ మేకర్స్. 

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అర్జున్ రెడ్డి డైరక్టర్ సందీప్ రెడ్డి వంగ అటెండ్ అయ్యారు. ఉప్పెన కథ తెలుసని బాగా నచ్చేసిందని.. సినిమా పాటలు కూడా బాగున్నాయని.. ఇలాంటి కథ తనకు ఎందుకు రాలేదని అనుకున్నానని అన్నారు సందీప్ వంగ. నిర్మాతలు తము చేయబోయే దర్శకులనే తమ సినిమాల ఈవెంట్లకు ఆహ్వానిస్తారు. ఈ క్రమంలో తెలుస్తున్న సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ, సందీప్ వంగ కాంబోని రిపీట్ చేస్తూ మైత్రి మూవీ మేకర్స్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారట. అర్జున్ రెడ్డి కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు తారాస్థాయిలో ఉన్నట్టే.

అర్జున్ రెడ్డిని హిందీలో రీమేక్ చేసిన సందీప్ వంగ అక్కడ సూపర్ హిట్ అందుకున్నాడు. రణ బీర్ కపూర్ తో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. త్వరలోనే విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నాడని టాక్.