
సక్సెస్ ఫుల్ డైరక్టర్ మారుతి మాస్ హీరో గోపీచంద్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పక్కా కమర్షియల్. యువి క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ జాలీ ఎల్.ఎల్.బి 2 రీమేక్ తో వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ తోనే డిఫరెంట్ గా ప్రయత్నించిన మారుతి మరో క్రేజీ మూవీతో రాబోతున్నాడు.
కొన్నాళ్లుగా కెరియర్ లో వెనకపడ్డ గోపీచంద్.. సినిమాలైతే చేస్తున్నాడు కాని హిట్లు దక్కడం లేదు. మినిమం గ్యారెంటీ డైరక్టర్ మారుతితో గోపీచంద్ సినిమా చేస్తున్నాడని తెలియగానే సినిమా దాదాపు ఫిక్స్ అవుతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా రాశి ఖన్నాని సెలెక్ట్ చేశారట. గోపీచంద్ తో రాశి ఖన్నా ఆక్సిజన్, జిల్ సినిమాలు చేసింది. ఆ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే మారుతి డైరక్షన్ లో వచ్చిన ప్రతిరోజూ పండుగతో హిట్ అందుకుంది కాబట్టి ఆ హీరోయిన్ నే రిపీట్ చేస్తున్నాడు డైరక్టర్ మారుతి. మరి కాంబో హిట్ అందిస్తుందా లేక గోపీచంద్ బ్యాడ్ లక్ వెంటాడుతుందా అన్నది చూడాలి.