
మాస్ మహరాజ్ రవితేజ నటించిన సూపర్ హిట్ మూవీ క్రాక్. గోపీచంద్ మలినేని డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటించాడు. కొన్నాళ్లుగా సక్సెస్ లు లేని రవితేజ క్రాక్ తో బాక్సాఫీస్ కు క్రాక్ ఎక్కించే హిట్ అందుకున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజైన ఈ సినిమా మంచి వసూళ్లతో దూసుకెళ్తుంది. అయితే థియేటర్లలో సందడి చేస్తున్న ఈ సినిమాను ఆహా ఓటిటిలో రిలీజ్ చేశారు.
మొదట జనవరి 29న ఆహాలో క్రాక్ రిలీజ్ అని చెప్పగా.. అది కాస్త ఫిబ్రవరి 5కి వాయిదా వేశారు. ఫైనల్ గా ఫిబ్రవరి 5న డిజిటల్ రిలీజైన క్రాక్ అక్కడ కూడా సూపర్ హిట్ అనిపించుకుంది. క్రాక్ సినిమా ఆహాలో రిలీజైన 24 గంటల్లోనే 22 మిలియన్ మినిట్స్ సాధించిన మూవీగా సూపర్ అనిపించుకుంది. కరెక్ట్ సినిమా పడితే రవితేజ స్టామినా ఏంటన్నది క్రాక్ మరోసారి ప్రూవ్ అయ్యింది.