సమంత@15 మిలియన్ ఫాలోవర్స్..!

అక్కినేని కోడలు సమంత ఖాతాలో మరో రికార్డ్ వచ్చి చేరింది. సౌత్ స్టార్ హీరోయిన్ గా ప్రేక్షకులను మాయ చేస్తూ వచ్చిన ఈ అమ్మడు పెళ్లి తర్వాత కూడా తన జోరు కొనసాగిస్తుంది. నాగ చైతన్యతో పెళ్లై రెండేళ్లు అవుతున్నా సరే సమంత తన స్టామినా చాటుతూనే ఉంది. పెళ్లైనా స్టార్ హీరోయిన్స్ కు పోటీ ఇస్తూ వరుస ఆఫర్లు అందుకుంటున్న అమ్మడు ఈమధ్య డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో కూడా అదరగొట్టేస్తుంది. ఆహా కోసం సామ్ జామ్ షో చేసిన సమంత అమేజాన్ ప్రైం లో ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సీరీస్ లో కూడా నటించింది.

సినిమాలు, వెబ్ సీరీస్ లతో ఫ్యాన్స్ ను అలరిస్తున్న సమంత సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. అందుకే సమంతకు అక్కడ బీభత్సమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఇక లేటెస్ట్ గా సమంత తన ఇన్ స్టాగ్రాం లో 15 మిలియన్ ఫాలోవర్స్ సాధించి రికార్డ్ అందుకుంది. సౌత్ లో ఏ స్టార్ హీరోయిన్ అందుకోని ఈ రేంజ్ ఫాలోవర్స్ సమంత అందుకుని సత్తా చాటింది. సౌత్ స్టార్స్ కూడా సమంత కన్నా వెనకపడ్డారని చెప్పొచ్చు. ఇదే జోరు కొనసాగిస్తే సమంత మరో ఐదారేళ్లు ఇదే ఫాం కొనసాగించే అవకాశం ఉంది.