
దాదాపు 60 సినిమాల దాకా నటించిన అల్లరి నరేష్ తన కెరియర్ లో అన్ని సినిమాలు ఒకలా ఉంటే కొన్ని మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అందులో గమ్యం, శంభో శివ శంభో, మహర్షి సినిమాలు ఉంటాయి. ఇక ఇప్పుడు ఆ లిస్ట్ లో మరో సినిమా చేరబోతుంది. అదే నాంది. విజయ్ కనకమేడల డైరక్షన్ లో అల్లరోడు హీరోగా వస్తున్న సినిమా ఈ నాంది. ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి ఈమధ్యనే రిలీజైన టీజర్ వరకు సినిమా చాలా ఆసక్తికరంగా ఉంటుందని చెబుతున్నారు.
న్యాయం కోసం పోరాడే ఓ వ్యక్తి కథతో వస్తున్న ఈ నాంది సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 19న అల్లరి నరేష్ నాంది రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. నరేష్ కెరియర్ లో డిఫరెంట్ సినిమాగా వస్తున్న నాంది సినిమా తప్పకుండా అతని కెరియర్ లో ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుందని చెప్పుకుంటున్నారు. సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు.
ఈమధ్యనే వచ్చిన బంగారు బుల్లోడు సినిమా కూడా నిరాశ కలిగించడంతో అల్లరి నరేష్ నాంది మీదనే నమ్మకం పెట్టుకున్నాడు. టీజర్ ఇంప్రెస్ చేయగా సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటే నరేష్ ఖాతాలో హిట్టు పడినట్టే.