సజ్జనార్ ను కలిసిన మాధవిలత..!

సోషల్ మీడియాలో తనపై చేస్తున్న ట్రోల్స్, కామెంట్స్ పై సిపి సజ్జనార్ ను కలిసి తన కప్లైంట్ అందించారు సినీ నటు మాధవిలత. తనపై కొందరు దుష్ప్రచారాలు చేస్తున్నారని.. వారిపై కఠిన చర్చలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. కొందరు కావాలని తనని బ్యాడ్ చేయాలని చూస్తున్నారని.. ఇష్టం వచ్చినట్టుగా కామెంట్స్ చేస్తున్నారని ఆమె కంప్లైంట్ లో రాసుకొచ్చారు.

సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటున్న మాధవి లత బిజేపి తరపున ప్రచారం చేస్తున్నారు. అతనపై సోషల్ మీడియాలో జరుగుతున్న వేధింపుల గురించి సజ్జనార్ ను కలిసి ఫిర్యాదు చేశారు మాధవిలత. తనపై ఈ కామెంట్స్ చేస్తున్నది ఎవరైనా సరే తాను వదిలేది లేదని ఆమె చెబుతున్నారు.. మాధవిలత ఇచ్చిన కంప్లైంట్ తీసుకున్న పోలీసులు ఆమెను సోషల్ హరాస్ మెంట్ చేస్తున్న వారిపై నిఘా పెట్టినట్టు తెలుస్తుంది.