కాంతారావు సతీమణి మృతి

దివంగత నటుడు కాంతారావు భార్య హైమావతి (87) గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. అన్నారోగ్యంతో ఆమె మరణించినట్టు తెలుస్తుంది. తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడిగా కాంతారావు 400 పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకుల హృదయాలను గెలిచారు. 2009లో కాంతారావు అనారోగ్యం వల్ల కన్నుమూశారు. ఆయన మృతి చెందిన తర్వాత వారి కుటుంబం ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణా ప్రభుత్వం ప్రతినెల కాంతారావు కుటుంబానికి పదివేల రూపయాల అర్ధిక సాయాన్ని అందిస్తూ వచ్చారు. 

కాంతారవు హైమావతి రెండవ భార్య. మొదటి భార్య సుశీల అనారోగ్యంతో బాధపడుతుండటంతో హైమావతిని పెళ్లి చేసుకున్నారు. ఫిబ్రవరి 4 మధ్యాహ్నం 12 గంటలకు మల్లాపూర్ లో వారి నివాసంలో హైమావతి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.