
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో ఇప్పటికే రాం చరణ్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడని తెలిసిందే. కొరటాల శివ డైరక్షన్ లో వస్తున్న ఆచార్య సినిమాలో సిద్ధ పాత్రలో చరణ్ అదరగొట్టనున్నాడట. ఇక ఈ సినిమాలో చరణ్ తో పాటుగా మరో స్టార్ హీరో కూడా నటిస్తున్నాడని టాక్. కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ కూడా ఆచార్యలో స్పెషల్ రోల్ చేస్తున్నారని తెలుస్తుంది. కన్నడలో స్టార్ హీరో అయిన సుదీప్ రాజమౌళి డైరక్షన్ లో వచ్చిన ఈగతో తెలుగులో విలన్ గా ఎంట్రీ ఇచ్చారు.
బాహుబలి ది బిగినింగ్ లో ఒక చిన్న పాత్రలో మెప్పించింది సుదీప్ మెగాస్టార్ చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ అయిన సైరా నరసిం హా రెడ్డి సినిమాలో కూడా నటించాడు. ఇక ఇప్పుడు మరోసారి మెగా మూవీలో ఛాన్స్ అందుకున్నట్టు తెలుస్తుంది. ఇంతకీ ఆచార్య సినిమాలో సుదీప్ ఎలాంటి పాత్ర చేస్తున్నాడు అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే అంటున్నారు. మే 13న ఆచార్య రిలీజ్ ఫిక్స్ చేశారు. మెగా ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది.